ఉరవకొండ: పట్టణ ఉపాధి హామీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి లత్తవరం తండా గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ పై చేయి చేసుకున్న ఉపాధి కూలీలు
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ కేంద్రంలోని ఉపాధి హామీ కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లత్తవరం తండా గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ రవి ఇంకుడు గుంతల నిధులు కాజేశాడని ఆరోపణలు చేస్తూ ఆ గ్రామ కూలీలు కొందరు దాడికి దిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇంకుడు గుంతలకు సంబంధించిన నిధులు కాజేశాడని కూలీలు ఆరోపిస్తూ ఫీల్డ్ అసిస్టెంట్ పై చేయి చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరువురుని స్టేషన్ కు తరలించారు.