సంతనూతలపాడు: నాగులుప్పలపాడు మండలం చదలవాడలో వైభవంగా శ్రీ రఘునాథ స్వామి కళ్యాణోత్సవం, గరుడ పక్షి దర్శనంతో పులకించిన భక్తులు
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో కొలువైన శ్రీ రఘునాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన కళ్యాణ మండపంలో శ్రీ రఘునాథ స్వామి వారి కళ్యాణాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో జరిపించగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీ రఘునాథ స్వామి వారి కళ్యాణాన్ని కనులారా వీక్షించారు. రఘునాథ స్వామి వారి కళ్యాణం జరుగుతున్న సమయంలో గరుడ పక్షి మూడుసార్లు ఆ ప్రాంతంలో ప్రదక్షిణ చేయడంతో భక్తులు చేసిన గోవింద నామస్మరణ ఆ ప్రాంగణమంతా మార్మ రోగేలా చేసింది.