రాప్తాడు: కూటమి ప్రభుత్వముతోనే రాష్ట్రము జిల్లా అభివృద్ధి చెందుతుంది పుట్టపర్తిలో విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యే పరిటాల సునీత
సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో మంగళవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో టిడిపి జిల్లా స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సత్యసాయి జిల్లా టిడిపి కార్యకర్తల సమావేశంలో రెండున్నర సంవత్సరంలో ఎంత అభివృద్ధి చేసామో కార్యకర్తలంతా తెలుసుకోవాలన్నారు చంద్రబాబునాయుడు నాయకత్వంలోనే రాష్ట్రము ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.