కనిగిరి: పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో రూ 25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ కార్యాలయ డిటి పృథ్వీరాజ్
కనిగిరి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఓ రైతు నుండి రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా ఆర్డీవో కార్యాలయ డిటి పృధ్వి రాజును ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. పృధ్వి రాజును ఆర్డీవో కార్యాలయంలోనే ఉంచి ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. విచారణ పూర్తయ్యాక మరిన్ని వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించే అవకాశం ఉంది.