సంతనూతలపాడు: మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు: సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్
మద్దిపాడు మండలం మల్లవరంలో కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు సంతనూతలపాడు ఎమ్మెల్యే బి ఎన్ విజయ్ కుమార్ తెలిపారు. ఈనెల 26 నుండి మే ఆరో తేదీ వరకు మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో శనివారం బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఆలయ చైర్మన్ మరియు కమిటీ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఆలయ అభివృద్ధికి ఇప్పటికే రూ.1 కోటి నిధులను మంజూరు చేయించడం జరిగిందన్నారు. ఆలయ అభివృద్ధికి అన్ని విధాల సహకారం అందిస్తామన్నారు.