సంతనూతలపాడు: నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా టీ దుకాణంలో మంటలు, కాలిపోయిన వస్తువులు
నాగులుప్పలపాడు: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ దుకాణంలో మంటలు వ్యాపించి అందులోని వస్తువులు అగ్నికి ఆహుతి అయిన సంఘటన నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో మంగళవారం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పుగుండూరులోని టీ దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దుకాణంలోని ఎలక్ట్రానిక్ వస్తువులు, విద్యుత్ పరికరాలతో పాటు మరి కొన్ని వస్తువులు అగ్నికి ఆహుతి అయ్యాయి. దుకాణ నిర్వాహకులతో పాటు స్థానికులు మంటలను అదుపు చేశారు.