కనిగిరి: అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: కనిగిరి అగ్ని మాపక శాఖ అధికారి సిహెచ్ బంగారు బాబు
కనిగిరి పట్టణంలో అగ్నిమాపక శాఖ వారోత్సవాలను అగ్నిమాపక శాఖ అధికారి సిహెచ్ బంగారుబాబు ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బందికి నివాళులు అర్పించారు. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అగ్నిమాపక శాఖ అధికారి బంగారు బాబు మరియు సిబ్బంది విద్యార్థులకు ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.