కనిగిరి: బట్టుపల్లి గ్రామ సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడి ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి
పెద చెర్లోపల్లి: ట్రాక్టర్ బోల్తాపడడంతో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన పెద చెర్లోపల్లి మండలంలోని బట్టుపల్లి గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదచెర్లోపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ రమణయ్య తన ఇంటి నిర్మాణం కోసం అవసరమైన వస్తు సామాగ్రిని తీసుకొని కనిగిరి నుండి పెదచెర్లోపల్లికి వెళుతున్న క్రమంలో బట్టుపల్లి గ్రామ సమీపంలో ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రమణయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.