కనిగిరి: హనుమంతునిపాడు మండలం వేములపాడు వద్ద అదుపుతప్పి బోల్తాపడ్డ ట్యాంకర్ లారీ , డ్రైవర్, క్లీనర్ కు గాయాలు
హనుమంతునిపాడు: ట్యాంకర్ లారీ అదుపుతప్పి బోల్తాపడడంతో డ్రైవర్ మరియు క్లీనర్ కు గాయాలైన సంఘటన హనుమంతునిపాడు మండలం వేములపాడు వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు నుండి సింగరాయకొండకు 28 మెట్లు టన్నుల బ్లీచింగ్ లిక్విడ్ తో వెళ్తున్న ట్యాంకర్ లారీ వేములపాడు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ కు గాయాలయ్యాయి. స్థానికులు రెవిన్యూ మరియు పోలీసులకు ప్రమాద సమాచారాన్ని అందజేశారు.