ఉరవకొండ: బెళుగుప్ప శ్రీ రామేశ్వర స్వామి దేవాలయంలో వర్షం కోసం రుద్రాభిషేకం జలాభిషేకం పూజలు
అనంతపురం జిల్లా బెళుగుప్ప మండల కేంద్రంలోని ప్రముఖ మరకత లింగ శ్రీ రామేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి ఎనిమిది గంటలకు వర్షం కోసం పంచామృత, జలాభిషేకాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఒకేరోజు ఆరుద్ర నక్షత్రం,మాసశివరాత్రి కలసి 50 ఏళ్లకు ఒక్కసారి వచ్చే అరుదైనరోజు కావడంతో స్వామివారికి రుద్రాభిషేకం పూజలను నిర్వహించారు. బెళుగుప్ప పరిసర ప్రాంతాలలో వర్షాలు బాగుగా కురిసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సంకల్పిస్తూ రైతులు గ్రామ ప్రజలతో కలసి అర్చక పండితులు జలాభిషేకం పూజలను నిర్వహించారు.