సంతనూతలపాడు: నాగులప్పలపాడు మండలం వినోద రాయుడుపాలెం లో పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు
నాగులుప్పలపాడు: పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించి, పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేసిన సంఘటన నాగులుప్పలపాడు మండలం వినోద రాయుడుపాలెం లో బుధవారం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వినోద రాయుడుపాలెంలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న ఎస్ఐ సుదర్శన్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేయడంతో పాటు వారి వద్ద నుండి రూ.10,020 లు నగదు , 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మండలంలో పేకాట శిబిరాలు, కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సుదర్శన్ హెచ్చరించారు.