కనిగిరి: పామూరులో శ్రీ మదన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం
పామూరు పట్టణంలో కొలువైన శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ మదన వేణుగోపాల స్వామి వారి ఆలయంలో స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రెండవ రోజు ధ్వజారోహణ కార్యక్రమాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామికి విశేష పూజలు, సహస్రనామార్చన కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో నరసింహబాబు ఏర్పాట్లు చేశారు.