సంతనూతలపాడు: గంజాయి వంటి మత్తు పదార్థాలకు కార్మికులు బానిసలు కావద్దు: మద్దిపాడులో డిఎస్పి శ్రీనివాసరావు
మద్దిపాడు గ్రోత్ సెంటర్ ఇండస్ట్రియల్ ఏరియాలో పనిచేస్తున్న కార్మికులకు డి.ఎస్.పి శ్రీనివాసరావు ఆదివారం గంజాయి వినియోగం, సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కార్మికులు గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని సూచించారు. గంజాయి కలిగి ఉన్న, అక్రమంగా విక్రయించిన చట్టరీత్యా నేరమన్నారు. సైబర్ నేరాలు పట్ల అవగాహన కల్పిస్తూ... తమ మొబైల్ ఫోన్లకు లేదా సోషల్ మీడియా గ్రూపులకు అపరిచిత వ్యక్తులు పంపే లింకులను ఓపెన్ చేయవద్దని, అలా చేస్తే బ్యాంకుల్లో నగదు సైబర్ నేరగాళ్లు ఖాళీ చేస్తారని హెచ్చరించారు.