కనిగిరి: పామూరు మండలం అయ్యవారిపల్లి లో టీచర్ మాధవి ఆత్మహత్య కేసులో నిందితుడు నాగూర్ భాష అరెస్ట్: పామూరు సీఐ శ్రీనివాసరావు
పామూరు మండలం అయ్యవారిపల్లి లో ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్ మాధవి ఆత్మహత్య కేసులో నాగూర్ భాషను అరెస్టు చేసినట్లు పామూరు సిఐ ఎం శ్రీనివాసరావు తెలిపారు. నిందితుడిని సోమవారం మీడియా ఎదుట సీఐ హాజరు పరిచారు. మాధవి పనిచేస్తున్న పామూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నిందితుడు పిల్లలు చదువుతున్న క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడిందన్నారు. మాధవి వీడియో కాల్స్ రికార్డ్ చేసి, సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడడంతో మాధవి ఆత్మహత్య చేసుకుందని సీఐ తెలిపారు.