రాప్తాడు: మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి క్షమాపణైనా చెప్పాలి వివరణ అయినా ఇవ్వాలి శ్రీనగర్ కాలనీలో TDP ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని శ్రీనగర్ కాలనీలో గురువారం 11:30 గంటల సమయంలో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నివాసం వద్ద టీడీపీ కార్యకర్తలు దళిత సంఘం నాయకులు రావడంతో ఉధృతమైన పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా ధర్మవరం టిడిపి ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ దళిత ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పై కించపరిచే విధంగా మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఎమ్మెస్ రాజుకు క్షమాపణైనా చెప్పాలని లేదా వివరణ అయినా ఇవ్వాలని లేకుంటే టీడీపీ కార్యకర్తలను దళితులను తాము నివారించలేమని ఏదైనా జరిగితే అందుకు ప్రకాష్ రెడ్డి కారణమైతాడని టిడిపి ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ ప్రకాష్ రెడ్డి ని హెచ్చరించారు.