సంతనూతలపాడు: మట్టి గుంటలో ఎమిలేరు కాలువ అండర్ గ్రౌండ్ టన్నల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్
నాగులుప్పలపాడు మండలం మట్టిగుంటలో ఎమిలేరు కాలువ అండర్ గ్రౌండ్ టన్నల్ నిర్మాణ పనులకు సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ శనివారం అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంతనూతలపాడు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఎన్నికల హామీలో భాగంగా ఎమిలేరు కాలువ అండర్ గ్రౌండ్ టన్నల్ నిర్మాణానికి హామీ ఇచ్చామని అందులో భాగంగానే నేడు పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. త్వరలోనే నిర్మాణ పనులను పూర్తి చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అధికారులు, స్థానిక టిడిపి నాయకులు పాల్గొన్నారు.