ఉరవకొండ: పెన్న అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఆలయ మహారథం ట్రయల్ రన్ సక్సెస్
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోని పవిత్ర పుణ్యక్షేత్రం పెన్న అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మహారథం ట్రయల్ రన్ సోమవారం నిర్వహించారు. ఎల్లుండి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందస్తు చర్యగా రథాన్ని పరీక్షించారు. ఈ నెలా 28 న బ్రహ్మోత్సవాలు ప్రారంభమై మేనెల 6 న స్వామి వారి రథోత్సవం జరగనుంది.