రాప్తాడు: రాప్తాడు నియోజకవర్గానికి చెందిన 44 మందికి 26 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అనంతపురంలో పంపిణీ చేసిన పరిటాల సునీత
అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంప్ కార్యాలయంలో మధ్యాహ్నం రెండున్నర నుంచి మూడున్నర గంటల వరకు రాప్తాడు నియోజకవర్గానికి చెందిన 44 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో రామగిరి కనగానపల్లి చెన్నై కొత్తపల్లి ఆత్మకూరు రాప్తాడు అనంతపురం రూరల్ మండలాలు చెందిన 44 మందికి 26 లక్షల రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో ఆరు మండలాలకు చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులు పాల్గొన్నారు.