రాప్తాడు: దళితులపై దాడిల అరికట్టాలి అనంతపురం రౌండ్ టేబుల్ సమావేశంలో రాప్తాడు ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేష్
అనంతపురం జిల్లా కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం 12:30 నుంచి 3 1/2 గంటల వరకు రాప్తాడు ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒంటిమిది ఓబులేష్ ఆధ్వర్యంలో దళితులపై దాడులు అరికట్టాలని దళిత సంఘం నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ ఓబులేసు ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగిపోయాయని కృష్ణలంకలో దళిత యువకులు మరణానికి కారకులైన పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి పేరు పోగు వెంకటేశ్వరరావుకు మూడు కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని దళిత సంఘం నేతలు డిమాండ్ చేశారు.