కనిగిరి: ఉద్యోగి భార్యకు కారుణ్య ఉద్యోగనియామక పత్రం అందజేసిన కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి మండలంలోని లింగారెడ్డిపల్లి సింగిల్ విండో సొసైటీలో సీఈవోగా పనిచేస్తున్న షేక్ చాంద్ బాషా ఇటీవల మృతి చెందారు. ఆయన భార్యకు ప్రభుత్వం కారుణ్య నియామకం కింద ఉద్యోగాన్ని ఇచ్చింది. కారుణ్య ఉద్యోగ నియామక పత్రాన్ని కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహరెడ్డి కనిగిరిలోని తన కార్యాలయంలో చాంద్బాషా భార్య నాజిని కి కారుణ్య ఉద్యోగ నియామక పత్రాన్ని మంగళవారం అందజేశారు. మృతి చెందిన ఉద్యోగి కుటుంబానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా త్వరగా ఉద్యోగం వచ్చేలా చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.