సంతనూతలపాడు: సంతనూతలపాడు లో స్వచ్ఛ పదం కార్యక్రమాన్ని నిర్వహించిన ఎంపీడీవో సురేష్ బాబు
సంతనూతలపాడు లో ఎంపీడీవో సురేష్ బాబు బుధవారం స్వచ్ఛ పదం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను ఎంపీడీవో స్వయంగా పర్యవేక్షించారు. చెత్తను రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వేస్తే చర్యలు తప్పవని ఎంపీడీవో హెచ్చరించారు. షాపుల నిర్వాహకులు చెత్తను రోడ్లపై వేస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానికులకు ఎంపీడీవో సూచించారు. తడి చెత్త, పొడి చెత్తను వేరుచేసి చెత్త సంపద కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ సిబ్బందిని ఎంపిడిఓ ఆదేశించారు.