ఉరవకొండ: బెలుగుప్పలోని వన్నూరు స్వామి పీర్ల మకాం వద్ద అగ్నిగుండ ప్రవేశం చేసిన పీర్ల స్వాములు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని వన్నూరు స్వామి పీర్ల చావడి వద్ద ఆదివారం ఉదయం 6 గంటలకు పీర్ల స్వాములు అగ్నిగుండ ప్రవేశం చేశారు. తెల్లవారుజాము నుండి పీర్ల స్వాములను ఎత్తుకుని గ్రామంలోని కాలనీలో తిరిగి భక్తులు చక్కెర చదివింపులు చేస్తూ గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామ నాభి శిలకు, వినాయక నగర్ లో ఏర్పాటు చేసిన గంగా కలస ములను ఎత్తి కుమ్మరించి వర్షాలు వస్తాయని భక్తులకు రైతులకు భవిష్య వాణి తెలియజేసారు. అనంతరం పీర్ల చావిడి వద్ద పీర్ల స్వాములు అగ్నిగుండ ప్రవేశం చేశారు. అనంతరం కొందరు భక్తులు సైతం అగ్నిగుండం లో నడిచారు.