సంతనూతలపాడు: మలేరియా వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సంతనూతలపాడు లో జిల్లా మలేరియా అధికారి మధుసూదన్ రావు
సంతనూతలపాడు లో మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి మధుసూదన్ రావు ఆధ్వర్యంలో శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ సెంటర్లో జిల్లా పంచాయతీ అధికారి మధుసూదన్ రావు మాట్లాడుతూ.... దోమ కాటు వల్ల మలేరియా వ్యాధి సంభవిస్తుందన్నారు. దోమలు కొట్టకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇళ్లలో మరియు పరిసర ప్రాంతాలలో మీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, నీరు నిల్వ ఉంటే దోమల లార్వా అభివృద్ధి చెంది, దోమలు వ్యాప్తి చెందుతాయని హెచ్చరించారు. మలేరియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.