కనిగిరి: అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: కనిగిరి అగ్నిమాపక శాఖ అధికారి బంగారు బాబు
కనిగిరి: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా కనిగిరి పట్టణంలోని పలు అపార్ట్మెంట్లో కనిగిరి అగ్నిమాపక శాఖ అధికారి బంగారు బాబు ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాలపై గురువారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్యాస్, ఎలక్ట్రిక్ మరియు ఆయిల్ వల్ల కలిగే అగ్ని ప్రమాదాలు వాటిని ఎలా నివారించాలో ప్రయోగాత్మకంగా అపార్ట్మెంట్లలో నివసిస్తున్న వారికి అగ్నిమాపక శాఖ సిబ్బంది చేసి చూపించారు. అపార్ట్మెంట్లలో అగ్నిప్రమాదం జరిగితే ఎలా తప్పించుకోవాలి, ప్రాణాలను ఎలా రక్షించుకోవాలో అగ్నిమాపక శాఖ అధికారి బంగారు బాబు వివరించారు. అగ్ని ప్రమాదాలు జరిగితే వెంటనే సమాచారం అందించాలన్నారు.