సంతనూతలపాడు: కెవి అగ్రహారంలో తన ముగ్గురు కుమార్తెలకు సుధాకర్ అనే వ్యక్తి విషమిచ్చి చంపిన ఘటనపై పోలీసుల విచారణ
చీమకుర్తి మండలం కె.వి అగ్రహారంలో శుక్రవారం తన ముగ్గురు కుమార్తెలు గోర్షిత(13) పూజిత (11), లోహిత (8) అనేవారికి సుధాకర్ అనే వ్యక్తి విషమిచ్చి చంపి, తాను ఆత్మహత్యకు పాల్పడిన విషయం విధితమే. అయితే ఈ కేసు విషయమై గ్రామంలో చీమకుర్తి సీఐ దాసరి ప్రసాద్ శనివారం విచారణ చేపట్టారు. ఇరుగుపొరుగు వారిని విచారించారు. సుధాకర్ భార్య వెంకటేశ్వరమ్మ మూడేళ్ల క్రితం భర్తతో విభేదించి పుట్టింటికి వెళ్ళింది. ఈనెల 22న వీరి విడాకుల కేసు విచారణకు రానున్న నేపథ్యంలో తన ముగ్గురు కుమార్తెలు తనకు దగ్గరనే అనుమానంతో సుధాకర్ వారికి విషమిచ్చి చంపి, తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.