రాప్తాడు: కక్కలపల్లి లో స్వర్ణాంధ్ర స్వచ్యాంద్ర కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన రాప్తాడు రాప ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని కక్కలపల్లి పంచాయతీలో శనివారం 12:30 గంటల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ నిర్వహించి విద్యార్థినిలకు రుచికరమైన పోషక ఆహారం అందించాలని పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని అదేవిధంగా అంగన్వాడీ కేంద్రానికి ప్రహరీ గోడ నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.