ఉరవకొండ: పాల్తూరులో డెంగ్యూ వ్యతిరేక మాస ఉత్సవాల ర్యాలీతో అవగాహన కార్యక్రమం
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామంలో బుధవారం డెంగ్యూ వ్యతిరేక మాస ఉత్సవాలలో భాగంగా వైద్యాధికారులు శివ శంకర్ నాయక్, సుస్మిత సమక్షంలో పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం ఆరోగ్య విస్తరణ అధికారి త్యాగరాజు, ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డిలతో కలసి డెంగ్యూ వ్యాధి నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ గ్రామాలలో పర్యటించి ఫీవర్ సర్వే నిర్వహించాలని, ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా తప్పక చూడాలని ప్రతి శుక్రవారం వారానికి ఒకరోజు డ్రై డే ఫ్రైడే పాటించాలన్నారు.