కనిగిరి: టిడిపి కార్యాలయం నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలి: కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి: ఒంగోలులో చేపడుతున్న టిడిపి కార్యాలయ నిర్మాణ పనులను కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహరెడ్డి టిడిపి నాయకులతో కలిసి ఆదివారం పరిశీలించారు. టిడిపి నూతన కార్యాలయ నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి ఆదేశించారు. స్థానిక నాయకులు ఎప్పటికప్పుడు కార్యాలయ నిర్మాణ పనులను పర్యవేక్షించాలని సూచించారు.