కనిగిరి: పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న డయాలసిస్ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించిన కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి పట్టణంలో అనూతనంగా కిడ్నీ రోగుల కోసం నిర్మిస్తున్న డయాలసిస్ సెంటర్ నిర్మాణ పనులను కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నర్సింహారెడ్డి మంగళవారం పరిశీలించారు. డయాలసిస్ కేంద్రం నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఎమ్మెల్యే ఆదేశించారు. డయాలసిస్ కేంద్రంలో కల్పించనున్న సౌకర్యాలపై ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కిడ్నీ రోగులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కిడ్నీ రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్యులు, సిబ్బందిని ఎమ్మెల్యే ఆదేశించారు.