కనిగిరి: వెలిగండ్ల డిప్యూటీ ఎంపీడీవో రాంప్రసాద్ పై దాడికి యత్నం
వెలిగండ్ల డిప్యూటీ ఎంపీడీవో సింగంపల్లి రాంప్రసాద్ శనివారం అధికారిక విధుల్లో భాగంగా మండలంలోని రామగోపాలపురం గ్రామాన్ని సందర్శించారు. కార్యాలయంలో సిబ్బందితో ఇటీవల జరిగిన సర్వేలకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తుండగా గ్రామానికి చెందిన మండ్ల నాగేంద్ర అనే వ్యక్తి అకారణంగా అసభ్య పదజాలంతో భౌతిక దాడికి యత్నించినట్టు రాంప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. నాగేంద్ర పై చర్యలు తీసుకోవాలంటూ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.