కనిగిరి: పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులు కల్పించాం: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి
కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించామని, కార్పొరేట్ వైద్యశాలకు దీటుగా ప్రభుత్వ వైద్యశాలను తీర్చిదిద్దామని కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో చేపట్టిన మౌలిక వసతుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్థానికులకు మరియు టిడిపి శ్రేణులకు ఎమ్మెల్యే మంగళవారం వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రూపాయి ఖర్చు లేకుండా గర్భవతులు ప్రభుత్వ వైద్యశాలలోని మదర్ కేర్ యూనిట్లో సుఖ ప్రసవంతో తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఇంటికి వెళ్లే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వ వైద్యశాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.