కనిగిరి: రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడుతున్న ఏకైక ఉపాధ్యాయ సంస్థ UTF : యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఖజారహంతుల్లా
కనిగిరి: రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడుతున్న ఏకైక ఉపాధ్యాయ సంస్థ యుటిఎఫ్ మాత్రమేనని మార్కాపురం జిల్లా యుటిఎఫ్ అధ్యక్షులు ఖాజా రహమతుల్లా అన్నారు. కనిగిరిలోని చింతలపాలెంలో యుటిఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు ఆయన సభ్యత్వం ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.... ప్రభుత్వం నుండి రావలసిన అన్ని బెనిఫిట్స్ అందేలా, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా అందరం పోరాటం చేసి వాటిని సాధించుకుందాం అన్నారు.