సంతనూతలపాడు: నాగులుప్పలపాడు మండలం చదలవాడలో వైభవంగా శ్రీ రఘునాథ స్వామి వారి గ్రామోత్సవం, మొక్కలు తీర్చుకున్న భక్తులు
నాగులుప్పలపాడు మండలంలోని చదలవాడలో కొలువైన శ్రీ రఘునాథ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో ఆలయ కమిటీ గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన గరుడ వాహనంపై స్వామివారిని గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఊరేగించారు. స్వామిని దర్శించుకున్న భక్తులు, కొబ్బరికాయలు కొట్టి, హారతులు బట్టి మొక్కులను తీర్చుకున్నారు.