కనిగిరి: పట్టణంలో ఈనెల 12న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పున: ప్రతిష్ట కార్యక్రమం, సాంప్రదాయ బద్దంగా ఆహ్వాన పత్రికల పంపిణీ
కనిగిరి పట్టణంలోని రామాలయం వీధిలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో, శ్రీ వాసవి మాత విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో ఈ నెల 12న అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు ఇంటింటికి మేళతాళాలతో సాంప్రదాయ బద్ధంగా శుక్రవారం అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఆహ్వాన పత్రికలను అందజేశారు. పట్టణంలోని భక్తులు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి భారీగా తరలివచ్చి, పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కమిటీ అధ్యక్షులు దేవకి శ్రీనివాసులు కోరారు