సంతనూతలపాడు: చీమకుర్తి ఎంపీడీవో కార్యాలయంలో ఈ నెల 11న మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి అధికారులు హాజరు కావాలి: ఎంపీడీవో రాఘవేంద్ర
చీమకుర్తి ఎంపీడీవో కార్యాలయంలో ఈ నెల 11న మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీవో రాఘవేంద్ర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన సూచించారు. అదేవిధంగా మండలంలోని అధికారులకు ఇప్పటికే సమావేశం గురించి సర్కిల్ జారీ చేయడం జరిగిందని, సమగ్ర సమాచారంతో సమావేశానికి అధికారులు హాజరు కావాలన్నారు.