ఉరవకొండ: యలగలవంక తాండ గ్రామంలో తాగునీటి పైప్ లైన్ లేకేజి లను పరిశీలించిన గ్రామ ప్రత్యేక అధికారి కృష్ణా నాయక్
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని యలగలవంక తాండ గ్రామంలో గ్రామ పంచాయతీ పైప్ లైన్ లీకేజి లను గ్రామ ప్రత్యేక అధికారి కృష్ణా నాయక్ మంగళవారం పరిశీలించారు. గ్రామానికి తాగునీటిని సరఫరా చేసే బోరు బావి వద్ద మరియు పైప్ లైన్లలో అధికంగా నీరు లీకేజీ కావడంతో నీరు అధికంగా వృథా అవుతోందని త్వరగా రిపేరి చేయాల్సిందిగా గ్రామపంచాయతీ అధికారులకు ప్రత్యేక అధికారి సూచించారు.