కనిగిరి: పట్టణంలోని హిందూస్మశాన వాటిక అభివృద్ధి పనులను పరిశీలించిన కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి
కనిగిరి పట్టణంలోని హిందూ స్మశాన వాటిక అభివృద్ధి పనులను మంగళవారం కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి, స్మశాన వాటికి అభివృద్ధిపై హిందూ స్మశాన వాటిక అభివృద్ధి కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు. అనంతరం స్మశాన వాటిక పరిసరాలను పరిశుభ్రం చేసే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. హిందూ స్మశాన వాటిక అభివృద్ధికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని ఎమ్మెల్యే కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు పాల్గొన్నారు.