కనిగిరి: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో తాగునీటి సమస్యపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి
కనిగిరి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి పట్టణంలోని తాగునీటి సమస్యపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ తాగునీటి సరఫరా తాగునీటి పనుల్లో పురోగతిపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు .ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రతి ఒక్కరికి తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, నిరంతరాయంగా తాగునీటి సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ పాల్గొన్నారు.