కనిగిరి: వెలిగండ్ల మండలంలో వైసీపీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలి: కనిగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి నారాయణ యాదవ్
వెలిగండ్ల మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని వైసిపి కనిగిరి నియోజకవర్గం ఇంచార్జ్ దద్దాల నారాయణ యాదవ్ సూచించారు. బుధవారం వెలిగండ్ల మండలంలోని రంగన్నపాలెంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీల జాబితాను నారాయణ యాదవ్కు స్థానిక నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా నారాయణ యాదవ్ మాట్లాడుతూ... వెలిగండ్ల మండలంలో బూత్, వార్డ్, గ్రామ, మండల స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. మండలంలో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు.