కనిగిరి: పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని ఉమ్మడి ప్రకాశం జిల్లా టిడిపి అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అధికారులు, విద్యార్థులు, ఎన్డీఏ కూటమి నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా యోగా సాధన చేసిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి మాట్లాడుతూ.... ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండా యోగా సాధన చేయాలని సూచించారు. యోగాతో ఒత్తిడిని అధిగమించడమే కాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది అన్నారు. యోగాతో దీర్ఘకాలిక రుగ్మతలను సైతం నయం చేసుకోవచ్చని సూచించారు.