కొత్తగూడెం: పాల్వంచ కనకదుర్గ ఆలయంలో వైభవంగా విజయదశమి వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రథోత్సవం, శమీ పూజ, తెప్పోత్సవం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో విజయ్ కుమార్ తెలిపారు. రేపు సామూహిక వ్రతాలు, అన్నదానం ఉంటాయి.