మహబూబాబాద్: పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయండి: మహబూబాబాద్ ఎమ్మెల్యే, ఎంపీ
ఖమ్మం-వరంగల్-నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్, ఎంపీ బలరాం నాయక్ కాంగ్రెస్ శ్రేణులను కోరారు. మండల, గ్రామ స్థాయిల్లో ఇన్చార్జిలను నియమించి, అర్హులైన వారందరినీ ఓటరుగా నమోదు చేయించాలని దిశానిర్దేశం చేశారు.