కనిగిరి: పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైన కనిగిరి ఆర్డీవో అజయ్ కుమార్
కనిగిరి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో గురువారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆర్డిఓ అజయ్ కుమార్ సమావేశమై స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ... బోగస్వట్ల తొలగింపుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. బోగస్ ఓట్లు తొలగింపు తో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే ఎన్నికల సంఘం యొక్క లక్ష్యమన్నారు. ఇంటింటికి బిఎల్వోలు వెళ్లి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో పాల్గొంటారని ఆర్డిఓ తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు.