ఉరవకొండ: జీడిపల్లి రిజర్వాయర్ వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
అనంతపురం జిల్లా బెళుగుప్ప మండల పరిధిలోని జీడిపల్లి గ్రామం వద్ద ఉన్న జీడిపల్లి రిజర్వాయర్ మరువ వద్ద హెచ్చరిక బోర్డులను ఆదివారం మండల తహసిల్దార్ అనిల్ కుమార్ ఏర్పాటు చేయించారు. గ్రామ రెవెన్యూ అధికారి ఎర్రి స్వామి, వీఆర్ఏ మహేంద్ర తదితరులు వెళ్లి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. జీడిపల్లి రిజర్వాయర్ లో వేసవి కాలం దృష్ట్యా వివిధ ప్రాంతాల నుండి పెద్దలు పిల్లలు ఈత సరదా కోసం వచ్చి పలు ప్రమాదాల బారిన పడి ప్రాణ నష్టం జరగకుండా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడం జరిగిందని మండల తహసిల్దార్ పేర్కొన్నారు.