ఉరవకొండ: యలగలవంక తండా గ్రామంలో తాగునీటి సరఫరా కోసం నూతన పైప్ లైన్ ఏర్పాటు
అనంతపురం జిల్లాబెళుగుప్ప మండలంయలగలవంక తాండ గ్రామంలో గ్రామపంచాయతీ బోరుబావి దగ్గర నుంచి తండా లోకి వెళ్లే మెయిన్ పైప్ లైన్ డ్యామేజ్ కావడంతో దాని స్థానంలో కొత్త పైప్ లైన్ వేయుటకు గ్రామ ప్రత్యేక అధికారి M క్రిష్ణా నాయక్ గారి ఆధ్వర్యంలో గురువారం పైప్ లైన్ ఏర్పాటు చేశారు. గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని గ్రామ ప్రత్యేక అధికారి, గ్రామ పంచాయతీ అధికారి మంజునాథులు పేర్కొన్నారు.