సంతనూతలపాడు: తాళ్లూరు మండలం గుంటి గంగమ్మ తిరునాళ్లకు చీమకుర్తి నుండి 35 ప్రత్యేక ఆర్టిసి బస్సులను ఏర్పాటు చేసిన అధికారులు
చీమకుర్తి పట్టణం నుండి తాళ్లూరు మండలం గుంటి గంగమ్మ తిరునాళ్లకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఆర్టిసి బస్సులను ఏర్పాటు చేశారు. శుక్రవారం గుంటి గంగమ్మ తిరునాళ్లకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా చీమకుర్తి నుండి 35 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టిసి అధికారులు తెలిపారు. శనివారం ఉదయం 10 గంటల వరకు ఈ ప్రత్యేక ఆర్టిసి బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు.