కనిగిరి: వెలిగండ్ల మండలంలో టిడిపి బలోపేతానికి, నాయకులు కార్యకర్తలు కృషి చేయాలి: ప్రకాశం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ కాశిరెడ్డి
వెలిగండ్ల మండలంలో టిడిపి బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి సూచించారు. వెలిగండ్ల మండల టిడిపి కార్యకర్తల సమావేశం బుధవారం స్థానిక టిడిపి కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీసీఎంఎస్ చైర్మన్ కాశిరెడ్డి మాట్లాడుతూ... మండలంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో టిడిపి విజయం సాధించేలా ఇప్పటినుండే తగిన కార్యాచరణతో పని చేయాలని సూచించారు.