కనిగిరి: వెలిగండ్లలో నిర్వహించిన స్వచ్ఛ పదం కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి
వెలిగండ్లలో బుధవారం నిర్వహించిన స్వచ్ఛ పదం కార్యక్రమంలో ప్రకాశం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ సిబ్బందితో కలిసి స్వయంగా చీపురు పట్టిన డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతిష్టాత్మకంగా ప్రతి బుధవారం స్వచ్ఛ పదం కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. స్వచ్ఛ పదం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.