ఉరవకొండ: బెళుగుప్ప లో కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమం
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని పాత తహసీల్దార్ కార్యాలయంలో కుష్ఠు వ్యాధి పైన అవగాహనా కార్యక్రమాన్ని పీహెచ్సీ వైద్యాధికారిణి టీ. ప్రియాంక, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ నీలకంఠ, ఏ ఎన్ ఎం ల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి నెల 10న నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రధాన అంశాలుగా కుష్ఠు వ్యాధి వచ్చిన వారు అంగవైకల్యం కాకుండ ఉండడం కోసం పుండు ఉన్న గాయాలను నీటిలో 30 నిముషాలు ఉంచి తరువాత అగాయాన్ని రాయితో తిక్కి దానికి కొద్దిగా కొబ్బరి నూనెను రాసి కట్టు కట్టుకొనినా కొన్ని రోజులకు అ గాయాలు మాని వ్యాధి ఉన్న వారికీ అంగవైకల్యం రాకుండా ఉంటుందన్నారు.