కనిగిరి: బీజేపీ ని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలి: పామూరులో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి
పామూరు: కనిగిరి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నరాల శ్రీనివాసులు రెడ్డి పిలుపునిచ్చారు. పామూరు, చంద్రశేఖరపురం, పెద్ద చెర్లోపల్లి మండలాలకు సంబంధించిన బిజెపి నాయకులు, కార్యకర్తల శిక్షణ కార్యక్రమం పామూరులో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోడీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. బూత్ స్థాయి నుండి మండల స్థాయి వరకు బిజెపిని బలోపేతం చేసేందుకు నాయకులు దృష్టి సారించాలన్నారు.